Glenn Maxwell: టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన గ్లెన్ మ్యాక్స్ వెల్

Glenn Maxwell equals Rohit Sharma most centuries record in T20 cricket
  • నేడు ఆసీస్-వెస్టిండీస్ రెండో టీ20
  • సెంచరీతో విరుచుకుపడిన మ్యాక్స్ వెల్
  • 50 బంతుల్లో 120 పరుగులు
  • టీ20 కెరీర్ లో మ్యాక్స్ వెల్ కు ఇది 5వ శతకం
  • 5 సెంచరీలతో టాప్ లో ఉన్న రోహిత్ శర్మ సరసన మ్యాక్స్ వెల్

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా సారథి రోహిత్  శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ వెస్టిండీస్ తో రెండో టీ20లో మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 50 బంతుల్లో 8 సిక్సులు, 12 ఫోర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

మ్యాక్స్ వెల్ కు టీ20 కెరీర్ లో ఇది 5వ సెంచరీ. తద్వారా ఈ డైనమిక్ బ్యాటర్... టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీల జాబితాలో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో 5 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. 

టీ20 క్రికెట్ అత్యధిక సెంచరీ వీరులు

1. రోహిత్ శర్మ- 5 (143 మ్యాచ్ లు)
1. గ్లెన్ మ్యాక్స్ వెల్- 5 (94 మ్యాచ్ లు)
2. సూర్యకుమార్ యాదవ్- 4 (57 మ్యాచ్ లు)
3. బాబర్ అజామ్- 3 (103 మ్యాచ్ లు)
4. కొలిన్ మన్రో-3 (62 మ్యాచ్ లు)

  • Loading...

More Telugu News