Reels: ఆసుపత్రిలో వైద్య విద్యార్థుల రీల్స్.. ట్రైనింగ్‌ మరో పది రోజుల పొడిగింపు

38 Medicos shoots reels in medical college in Karnataka
  • కర్ణాటకలోని జిమ్స్‌లో ఘటన
  • మరో 20 రోజుల్లో ముగియనున్న శిక్షణ
  • ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం అనుమతి లేకుండా రీల్స్
  • విద్యార్థులకు జరిమానాతోపాటు శిక్షణ పెంపు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ఓ వైద్యుడు ప్రీవెడ్డింగ్ షూట్ నిర్వహించి సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన ఘటన మరువకముందే కర్ణాటకలోనే అలాంటిదే మరో ఘటన జరిగింది.

గడగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జీఐఎంఎస్)లో చదువుతున్న 38 మంది విద్యార్థుల శిక్షణ మరో 20 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ప్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం కోసం అనుమతి లేకుండా వారంతా రీల్స్ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో జీఐఎంఎస్ తీవ్రంగా స్పందించింది. 

రీల్స్ కోసం విద్యార్థులకు తాము అనుమతి ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఘోర తప్పిదానికి పాల్పడిన విద్యార్థులకు జరిమానా విధించడంతోపాటు శిక్షణను మరో 10 రోజులు పొడిగించినట్టు జిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ పేర్కొన్నారు.
Reels
Karnataka
GIMS
Pre Wedding Photoshoot
Chitradurga

More Telugu News