Anand Devarakonda: ఆ బాధ నుంచి బయటపడేందుకు ఐదేళ్లు పట్టింది.. ‘బేబీ’ హీరో ఆనంద్ దేవరకొండ

Tollywood young hero Anand Devarakonda breaks silence about his breakup
  • తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టిన ఆనంద్ 
  • ప్రేమికురాలి కోసం షికాగో వెళ్తే వ్యవహారం బెడిసికొట్టిందని ఆవేదన
  • తాను సిన్సియర్‌గా లవ్ చేసినా ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని ఆవేదన

దొరసాని సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, బేబీ మూవీతో బ్లాక్‌బ్లస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా తన బ్రేకప్ విషయాన్ని బయటపెట్టాడు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్, బ్రేకప్ విషయాన్ని పంచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు.

తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్తే తాను కూడా వెళ్లాలని అనుకున్నట్టు చెప్పాడు. అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని భావించానని పేర్కొన్నాడు. అందుకోసం షికాగోలోని టాప్-5 ఇంజినీరింగ్ కాలేజీలకు దరఖాస్తు చేసుకుంటే ఓ దాంట్లో సీటు వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. 

అక్కడికి వెళ్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని అనుకున్నానని, కానీ కథ అడ్డం తిరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడికెళ్లాక వ్యవహారం బెడిసికొట్టిందని, తన గుండె పగిలిందని చెప్పుకొచ్చాడు. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు తనకు ఏకంగా నాలుగైదేళ్లు పట్టినట్టు వివరించాడు. తాను నిజాయతీగా ప్రేమించినా ఫలితం లేకుండా పోయిందని, అది తనను చాలా బాధపెట్టిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

  • Loading...

More Telugu News