Marriages: మూడు నెలలు ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఒక్కటయ్యేందుకు 13 వేల జంటలు రెడీ!

13 thousand couples ready to be one in Maghamasam in Hyderabad
  • నిన్నటి నుంచి ప్రారంభమైన మాఘమాసం
  • నేటి నుంచి ఏప్రిల్ 28 వరకు వరుస వివాహాలు
  • కళకళలాడుతున్న షాపింగ్ మాల్స్.. బంగారు దుకాణాలు
  • ఒకే వేదికపై రెండుమూడు పెళ్లిళ్లు
ఏడడుగులు నడిచే శుభ ఘడియ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తే. నిన్నటి నుంచి మాఘమాసం ప్రారంభం కాగా నేటి నుంచి ఏప్రిల్ 28 వరకు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకున్న వారు షాపింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో అనుబంధ రంగాలు కూడా బిజీగా మారిపోయాయి. వస్త్ర, నగల దుకాణాలతోపాటు ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, కల్యాణ మండపాలు, అద్దె వాహనాలకు అప్పుడే బుకింగ్‌లు మొదలయ్యాయి. ఫంక్షన్ హాళ్లు దొరక్కపోవడంతో ఒకే వేదికపై ఒకదాని తర్వాత ఒకటిగా రెండు మూడు పెళ్లళ్లకు కూడా బుక్ అవుతున్నాయి. ఈ మూడు నెలల్లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 13 వేల పెళ్లిళ్లు జరగనున్నాయి.

డెస్టినేషన్ వెడ్డింగులకే మొగ్గు
గతంతో పోలిస్తే ఇప్పుడు డెస్టినేషన్ వివాహాలపై చాలామంది మొగ్గుచూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు సంపన్నులు మాత్రమే ఈ రకం వివాహాలు చేసుకొనేవారు. ఇప్పుడు సామాన్యులు సైతం అటువైపు మొగ్గుచూపుతున్నారు. డిస్టినేషన్ వెడ్డింగులకు విదేశాలను ఎంచుకోకుండా దేశంలోనే జరుపుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఉదయ్‌పూర్, జైపూర్‌తోపాటు కేరళ, గోవా, సిమ్లా, కశ్మీర్, ఖజురహో, ఆగ్రా వంటి నగరాలను డిస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎంచుకుంటున్నారు. కొందరు  మాత్రం తాముండే నగర శివార్లలో ఉండే రిసార్టులు, ఫాం హౌస్‌లను కూడా ఎంచుకుంటున్నారు.
Marriages
Destination Weddings
Maghamasam

More Telugu News