Shamar Joseph: ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న విండీస్ సంచలన పేసర్

West Indies pace sensation Shamar Joseph set to make IPL debut
  • ఇటీవల ఆసీస్ పై 7 వికెట్లు తీసిన షామార్ జోసెఫ్
  • వెస్టిండీస్ కు 21 ఏళ్ల తర్వాత ఆసీస్ పై తొలి విజయం
  • మార్క్ ఉడ్ స్థానంలో షామార్ జోసెఫ్ ను కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 
  • షామార్ జోసెఫ్ కు రూ.3 కోట్ల పారితోషికం
ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చి, వెస్టిండీస్ జట్టుకు 21 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయాన్ని అందించిన యువ ఫాస్ట్ బౌలర్ షామార్ జోసెఫ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇంగ్లండ్ బౌలర్ మార్క్ ఉడ్ స్థానంలో షామార్ జోసెఫ్ ను కొనుగోలు చేసింది. షామార్ జోసెఫ్ కు రూ.3 కోట్లు చెల్లించాలని లక్నో నిర్ణయించింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

24 ఏళ్ల షామార్ జోసెఫ్ ఇప్పటివరకు ఐపీఎల్ గడప తొక్కలేదు. ఈ నేపథ్యంలో, తన తొలి సీజన్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.
Shamar Joseph
LSG
IPL
Mark Wood
West Indies

More Telugu News