Prudhvi Raj: వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజానే: పృథ్వీరాజ్

Prudhviraj comments on Roja
  • ఫట్ మని ఎగిరిపోయే వికెట్ రోజాదేనని వ్యాఖ్యలు
  • రోజా క్లీన్ బౌల్డ్ అవుతుందని జోస్యం
  • డైమండ్ రాణిపై చాలా ఆరోపణలున్నాయన్న పృథ్వీరాజ్

టాలీవుడ్ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది రోజానే అని స్పష్టం చేశారు. ఫట్ మని ఎగిరిపోయే వికెట్ ఆమెదేనని, రోజా క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. డైమండ్ రాణిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, జనసేన-టీడీపీ మిశ్రమ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తామని పృథ్వీరాజ్ అన్నారు. గతంలో రోజా చేసిన అసందర్భ వ్యాఖ్యలకు తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. 

శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు జనసేన-టీడీపీ కూటమికి 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు రావడం ఖాయమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News