Sanket Jayshukh Bulsara: న్యూయార్క్ జడ్జిగా భారత సంతతి వ్యక్తి.. తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డు

Biden nomintes Indian origin Judge to US court of eastern district of New York
  • అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా సంకేత్ జయేశ్ బల్సారా
  • 2017 నుంచి అదే కోర్టులో న్యాయమూర్తిగా సేవలు
  • సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, నియంత్రణ వ్యవహారాల్లో సంకేత్ నిపుణుడు
అమెరికా ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా (46)ను జో బైడెన్ ప్రభుత్వం న్యూయార్క్‌లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమించింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రకటించింది. సంకేత్ 2017 నుంచి ఇదే కోర్టులో మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడాయన న్యాయమూర్తిగా నియమితులై మరో రికార్డు అందుకున్నారు. ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కారు.

ఆయన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం భారత్, కెన్యా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ వ్యవహారాల్లో సంకేత్ నిపుణుడు. ఆయన తండ్రి న్యూయార్క్ మున్సిపాలిటీలో ఇంజినీర్ కాగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు.
Sanket Jayshukh Bulsara
New York
US District Court
Joe Biden

More Telugu News