నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి లారీ, బస్సును ఢీకొట్టిన మరో లారీ.. ఆరుగురి దుర్మరణం
- కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఘటన
- మరో 15మందికి తీవ్ర గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే చనిపోయిన ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.