Singireddy Niranjan Reddy: తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయలేరు: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy says no one can remove KCR foot steps in telangana
  • తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్న నిరంజన్ రెడ్డి 
  • ఆయన ఆనవాళ్లు చెరపడం మీ వల్ల కాదని వ్యాఖ్య  
  • తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ఢిల్లీకి వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్ ఆనవాళ్లు ఉంటాయని వ్యాఖ్య
  • భగత్ సింగ్, నేతాజీ, పటేల్ ఆనవాళ్లు చెరిపివేయలేకపోయారన్న మాజీ మంత్రి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం రూపంలో కేసీఆర్ ఆనవాలు కళ్లముందు కనిపిస్తోందని, ఆయన ఆనవాళ్లు చెరిపివేయడం కాంగ్రెస్ వల్ల కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అంటేనే కేసీఆర్... ఆయన ఆనవాళ్లు చెరపడం మీ వల్ల కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ఢిల్లీకి వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్ ఆనవాళ్లు మీ కంటే ముందే ఉంటాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎంత చెరిపేయాలనుకున్నప్పటికీ భగత్‌ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అంబేద్కర్, పీవీ నరసింహారావు వంటి వారి ఆనవాళ్లు చెరిపేయలేకపోయారన్నారు. అలాగే గాంధీ, నెహ్రూ ఆనవాళ్లు 75 సంవత్సరాలైనా ఎవరూ చెరిపి వేయలేకపోయారన్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపివేయడం కాంగ్రెస్ తరం కాదన్నారు.
Singireddy Niranjan Reddy
KCR
BRS
Congress

More Telugu News