Perni Nani: ఏపీకి బీజేపీ ఏం న్యాయం చేసిందో చంద్రబాబు చెప్పాలి: పేర్ని నాని

Perni Nani demands Chandrababu to give answer what BJP has done for AP
  • జగన్ ను ఎదుర్కోలేక పవన్ ను, బీజేపీని తీసుకొస్తున్నారన్న పేర్ని నాని
  • దోసెడు మట్టి, చెంబుడు నీరు ఇచ్చారని ఎద్దేవా
  • అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తాడని విమర్శ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోలేక పవన్ ను, బీజేపీని చంద్రబాబు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా, పోలవరం పూర్తి చేసిందా, కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా, రైల్వే జోన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. 

అమరావతి కోసం దోసెడు మట్టి, చెంబుడు నీరు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి చేసిన పాపాలకు చంద్రబాబు, బీజేపీ క్షమాపణలు చెపుతారా అని ప్రశ్నించారు. లేదా సిగ్గు, ఎగ్గు లేకుండా జనం మధ్యకు వస్తారా అని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భార్యాపిల్లలు లేని వ్యక్తి మోదీ అని చంద్రబాబు తిట్టారని... ఇప్పుడు ఆయనతో కలిసి పోటీ చేయడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Perni Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News