Jagga Reddy: కేసీఆర్, కేటీఆర్‌లకు హరీశ్ రావు వెన్నుపోటు పొడుస్తాడు: జగ్గారెడ్డి

Jagga Reddy hot comments on Harish Rao
  • కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని వ్యాఖ్య
  • పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో హరీశ్ రావు వెన్నుపోటు పొడుస్తారన్న జగ్గారెడ్డి
  • తాము ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ విమర్శలు చేయడం విడ్డూరమన్న జగ్గారెడ్డి  
పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వెన్నుపోటు పొడుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో జరిగే అంతర్యుద్ధంలో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదన్నారు. వారికి హరీశ్ రావు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఇక మేం (మీకు వెన్నుపోటు పొడిచేందుకు) అవసరం లేదన్నారు. మేం ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ మీరు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. 
Jagga Reddy
Congress
Telangana

More Telugu News