Vijayashanti: మరోసారి కేసీఆర్‌ను టార్గెట్ చేసిన విజయశాంతి

Vijayashanthi targets KCR again
  • మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే అవకాశముందని వార్తలు వచ్చాయన్న విజయశాంతి
  • ఈ తప్పులకు కేసీఆర్ తప్పకుండా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్
  • తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా చేసిన దుర్మార్గానికి ఫలితం తప్పదని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి ఉన్నదనే తెలిసినప్పుడు కేసీఆర్ తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు రాములమ్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అనేక అవకతవకలు బయటపడుతూ... అది కూలిపోయే పరిస్థితికి కూడా అవకాశముందని వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ తప్పులకు (మేడిగడ్డ కూలిపోయే అవకాశం) కేసీఆర్ తప్పకుండా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా చేసిన దుర్మార్గానికి తగిన ఫలితం ఎవ్వరికైనా తప్పక ఉంటుందని వ్యాఖ్యానించారు.
Vijayashanti
Telangana
Congress
KCR

More Telugu News