KTR: మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడిగిన కేటీఆర్

Interesting chit chat between komatireddy and ktr
  • అసెంబ్లీ ప్రాంగణంలో పరస్పరం ఎదురుపడిన రాజగోపాల్ రెడ్డి-కేటీఆర్
  • లోక్ సభ ఎన్నికల్లో కూతురు పోటీ చేస్తుందా? అని అడిగిన కేటీఆర్
  • తనను వివాదంలోకి లాగవద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి పదవి, లోక్ సభ ఎన్నికల్లో పోటీ అంశానికి సంబంధించి కేటీఆర్... రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే తనను వివాదంలోకి లాగవద్దని సరదాగా వ్యాఖ్యానిస్తూ కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌‌కు కోమటిరెడ్డి ఎదురయ్యారు.

ఈ సమయంలో... మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి కోమటిరెడ్డి... మీలాగే నాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. దీంతో కేటీఆర్... ఫ్యామిలీ పాలన కాదు... మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయన్నారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అంశంపై అడిగారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా? సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు. అయితే రాజగోపాల్ మాత్రం... దయచేసి తనను వివాదంలోకి లాగవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

కేసీఆరే దగ్గరుండి బీజేపీలోకి పంపిస్తారు

అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. కేసీఆర్ దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపిస్తారని విమర్శించారు. వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీలో చేరుతారన్నారు. తాను హోంమంత్రినై బీఆర్ఎస్ వాళ్లను జైలుకు పంపించాలని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు చెప్పారు.
KTR
Komatireddy Raj Gopal Reddy
BRS

More Telugu News