Priyamani: పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలనుంది: నటి ప్రియమణి

Priyamani Interview
  • నటిగా ఇప్పుడు ప్రియమణి బిజీ 
  • త్వరలో రానున్న 'భామా కలాపం 2'
  • 'నారప్ప'తో ముచ్చట తీరిందని వెల్లడి
  • తనకి ఇష్టమైన పాత్రను గురించిన వివరణ

ఒక వైపున సినిమాలతోను .. మరో వైపున వెబ్ సిరీస్ ల తోను ప్రియమణి బిజీగా ఉంది. 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఆమె చేసిన 'భామాకలాపం 2' ఈ నెల 16వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె సందడి చేస్తోంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. 

"వెంకటేశ్ గారితో ఒక సినిమా చేయాలనే కోరిక చాలా కాలంగా ఉండేది. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఎదురుపడినా, నా మనసులోని మాటను చెబుతూ ఉండేదానిని. అలాంటి నా ముచ్చట 'నారప్ప' సినిమాతో తీరిపోయింది. వెంకటేశ్ గారు చాలా పెద్ద స్టార్ .. అయినా ఆయన సెట్లో చాలా సింపుల్ గా ఉండేవారు. అందరితోనూ సరదాగా మాట్లాడేవారు. 

ఇంతవరకూ నేను చాలా పాత్రలను పోషించాను. అయితే నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రను చేయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ఇక పవర్ఫుల్ విలన్ రోల్ చేయాలనే కోరిక కూడా బలంగా ఉంది. అలాంటి ఒక ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను" అని అన్నారు. అంటే ప్రియమణి .. వరలక్ష్మి శరత్ కుమార్ తరహా పాత్రల వైపు చూస్తుందన్న మాట. 

  • Loading...

More Telugu News