James Cameron: దర్శకధీరుడు రాజమౌళిపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించిన హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్‌ కామెరూన్

Hollywood director James Cameron once again praised Jakkanna Rajamouli
  • ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో రాజమౌళి అద్భుతం చేశారని ప్రశంసించిన హాలీవుడ్ దిగ్గజం
  • ఆయనను కలుసుకోవడం ఎప్పటికీ మరచిపోలేనన్న కామెరూన్
  • ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను చూడడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కించనున్న సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న దర్శకధీరుడు రాజమౌళిని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి ప్రశంసించారు. ప్రపంచవేదికపై భారతీయ సినిమాను చూడడం సంతోషంగా అనిపించిందని కామెరూన్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో రాజమౌళి అద్భుతం చేశారని, ఆయన్ను కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో జరిగిన  51వ వార్షిక శాటర్న్‌ అవార్డుల వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని జేమ్స్‌ కామెరూన్‌ తెగ మెచ్చుకున్నారు. రాజమౌళి కథను చెప్పే విధానంలో షేక్‌స్పియర్‌ను గుర్తుకు తెచ్చారని అన్నారు. కేవలం గ్రాఫిక్స్‌‌ కాకుండా కథలో ప్రతి పాత్రను తెరపై చాలా బాగా ఆవిష్కరించారని, ఆ సినిమాను మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయానని ప్రశంసించారు. రాజమౌళి తనతో 10 నిమిషాలు మాట్లాడారంటే నమ్మలేకపోతున్నానని జేమ్స్ కామెరూన్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. తాను దర్శకత్వం వహించిన సినిమాను ఆయన సమీక్షించి వివరించడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆ పోస్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.
James Cameron
Rajamouli
Hollywood
Tollywood
RRR

More Telugu News