Budget: రూ.2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. సమగ్ర స్వరూపం ఇదే..!

Vote On Budget In Andhrapradesh Assembly
  • వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చాం: మంత్రి బుగ్గన
  • బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రూపకల్పన
  • చాణక్యుడి తరహాలో సీఎం జగన్ పాలిస్తున్నారని ప్రశంస

బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు.

బడ్జెట్ స్వరూపం..
వార్షిక బడ్జెట్ రూ. 2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ. 30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం

  • Loading...

More Telugu News