US Consulate General: తాపీ మేస్త్రి కోసం సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చిన హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్

US Consulate General Hyderabad hiring for Mason
  • తాపీ మేస్త్రి కావలెను అంటూ నియామక ప్రకటన
  • రూ.4.47 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్న కాన్సులేట్ కార్యాలయం
  • దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 25
తెలుగు రాష్ట్రాల పరిధిలో వీసా సేవలు అందించేందుకు హైదరాబాదులో ఏర్పాటైన అమెరికా కాన్సులేట్ జనరల్ తాజాగా తాపీ మేస్త్రి కావలెను అంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. తాపీ మేస్త్రి నియామకం కోసం ఏకంగా ఉద్యోగ నియామకం చేపట్టింది. 

ఎఫ్ఎస్ఎన్-04 గ్రేడ్ కింద తాపీ మేస్త్రి ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఏడాది వేతనం రూ.4,47,349 అని వెల్లడించింది. దాంతో పాటే ఇతర ప్రయోజనాలు కూడా వర్తింపజేస్తామని యూఎస్ కాన్సులేట్ జనరల్ పేర్కొంది.

https://in.usembassy.gov/embassy-consulates/jobs/hyderabad/ ... ఈ వెబ్ లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

తాపీమేస్త్రి నియామక దరఖాస్తులు ఎలక్ట్రానిక్ పద్దతిలో ఆమోదించబడతాయని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25 అని హైదరాబాదులోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.
US Consulate General
Mason
Hyderabad
Appilcations
Hiring
Telangana
Andhra Pradesh

More Telugu News