అండర్-19 వరల్డ్ కప్: సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై టాస్ నెగ్గిన భారత్
- నేడు అండర్-19 వరల్డ్ కప్ లో తొలి సెమీస్
- బెనోనీ నగరంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అయితే, సొంతగడ్డపై ఆడుతున్న దక్షిణాఫ్రికా యువ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, ఎల్లుండి (ఫిబ్రవరి 8) జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేటి సెమీస్ లో భారత్ గెలిచి, ఎల్లుండి పాకిస్థాన్ కూడా నెగ్గాలని... దాంతో, దాయాదుల మధ్య ఫైనల్ సమరం జరిగితే చూడాలని ఇరుదేశాల క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.