VIP Break Darshan: ఇకపై ఆన్ లైన్ లో తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు

TTD decides to issue VIP Break Darshan tickets through online
  • ఇప్పటివరకు కౌంటర్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీ
  • భక్తులు అధిక సమయం క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి
  • ఇకపై సిఫారసు లేఖలు అందజేసే భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్
  • లింక్ క్లిక్ చేసి ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తే వీఐపీ బ్రేక్ టికెట్ మంజూరు

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఇప్పటివరకు ఎంబీసీ-34 కౌంటర్ వద్ద క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను ఆన్ లైన్ విధానంలో అందించాలని టీటీడీ నిర్ణయించింది. 

సిఫారసు లేఖలు అందించిన భక్తుల మొబైల్ ఫోన్లకు టీటీడీ ఓ లింక్ ను మెసేజ్ రూపంలో పంపుతుంది. అది పేమెంట్ ఆప్షన్ కు సంబంధించిన లింకు. ఆ లింకును క్లిక్ చేసి ఆన్ లైన్ లో నగదు చెల్లిస్తే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ ను పొందవచ్చు. 

గత రెండ్రోజులుగా టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిపై భక్తుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. 

టీటీడీ తాజా నిర్ణయంతో, వీఐపీ బ్రేక్ దర్శనం పొందగోరే భక్తులు టికెట్ల కోసం అధిక సమయం పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండదు.

  • Loading...

More Telugu News