YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ కి వాయిదా

Supreme Court key orders in YS Avinash Reddy bail cancelation petition
  • ఏప్రిల్ 22 తర్వాత వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు
  • ఆలోగా కేసు డైరీ వివరాలను అందించాలని సీబీఐకి ఆదేశాలు
  • కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలన్న ధర్మాసనం
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏప్రిల్ 22 తర్వాత వాదనలను వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 22లోపు వాదనలు వినడం కుదరదని చెప్పింది. ఆలోగా కేసు డైరీ వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
YS Avinash Reddy
YS Sunitha Reddy
Supreme Court
YSRCP

More Telugu News