Birudu Rajamallu: మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత

  • ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన రాజమల్లు
  • 1994లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు
  • 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజమల్లు
Ex MLA Birudu Rajamallu passes away

పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన కొంత కాలంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1930లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 

తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయింది. తొలుత సుల్తానాబాద్ పీఏసీఎస్ ఛైర్మన్ గా ఆయన గెలిచారు. ఆ తర్వాత 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1994లో మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి దాదాపు 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపు కోసం కృషి చేశారు.

More Telugu News