Harish Rao: కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి: మాజీ మంత్రి హరీశ్‌రావు

BRS defeat in assembly elections was due to Congresss negitive campaign says Former Minister Harish Rao
  • బీఆర్ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందని వ్యాఖ్య
  • ఏం జరిగినా మంచికేనన్న హరీశ్ రావు
  • పటాన్‌చెరు నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం ఉందని, అయితే కాంగ్రెస్‌ దుష్ప్రచారం కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యామని, ఏం జరిగినా తమ మంచికేనని అన్నారు. అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చారని, నోటిఫికేషన్ వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. పటాన్‌చెరు నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao
BRS
Telangana
Congress

More Telugu News