YS Sharmila: షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi reacts to social media comments on YS Sharmila
  • మహిళలను అవమానించడం నీచం అంటూ మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ
  • షర్మిల, వైఎస్ సునీతపై సోషల్ మీడియాలో దాడిని ఖండించిన రాహుల్
  • వారికి కాంగ్రెస్ పార్టీతో పాటు తాను అండగా ఉంటానని వెల్లడి

మహిళలను అవమానించడం, వారిపై మాటల దాడి చేయడం నీచమైన పనంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పనిని కేవలం పిరికిపందలు చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియా వేదికగా దాడులు జరగడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఆదివారం ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు.

మహిళలను కించపరచడం, బెదిరించడం పిరికిపందల చర్య అని, దురదృష్టవశాత్తూ శక్తిహీనులకు ఇదొక ఆయుధంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News