Raa Kadali Raa: ఈ నెల 5 నుంచి చంద్రబాబు 'రా కదలిరా' సభలు

  • ఎన్నికల నేపథ్యంలో రా కదలిరా సభలు నిర్వహిస్తున్న టీడీపీ
  • ఫిబ్రవరి 5, 6 తేదీల్లో రెండ్రోజుల పాటు మూడు సభలు
  • హాజరు కానున్న చంద్రబాబు
TDP organises Raa Kadali Raa meetings on Feb 5 and 6

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో రా కదలిరా సభలకు హాజరవుతూ, మేనిఫెస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఈ నెల 5 నుంచి రెండ్రోజుల పాటు జరిగే రా కదలి రా సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మూడు చోట్ల రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 5న అనకాపల్లి జిల్లా  మాడుగుల, ఏలూరు జిల్లా చింతలపూడిలో బహిరంగ సభలు జరపనున్నారు. ఈ నెల 6న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 17 లోక్ సభ స్థానాల పరిధిలో ఈ సభలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News