Virat Kohli: రెండో బిడ్డకు తండ్రి కాబోతున్న కోహ్లీ... డివిలియర్స్ వ్యాఖ్యలతో క్లారిటీ

AB DeVilliers said Kohli set to welcome second chiled
  • 2017లో పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
  • 2021లో వామిక జననం
  • తాజాగా ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న కోహ్లీ
  • ప్రసవ సమయంలో భార్యకు దగ్గరగా ఉండేందుకేనని ప్రచారం
  • కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతుందన్న ఏబీ డివిలియర్స్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ అర్ధాంగి అనుష్క రెండో బిడ్డకు జన్మనిస్తుండడం వల్లే కోహ్లీ విరామం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. 

కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని డివిలియర్స్ యూట్యూబ్ లైవ్ లో వెల్లడించాడు. కొన్నిరోజుల కిందటే తాను కోహ్లీతో చాటింగ్ చేశానని, కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న విషయం వాస్తవమే అని తెలిపాడు.  

జట్టు కంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని ఎవరైనా కోహ్లీని తప్పుబడితే అది సరికాదని అన్నాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ తన కుటుంబంతో ఉండడమే సరైన నిర్ణయం అని అభిప్రాయపడ్డాడు. 

కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో ఓ కుమార్తె జన్మించింది. ఆ పాపకు వామిక అని నామకరణం చేశారు.

  • Loading...

More Telugu News