Electricity: ప్రతీ కనెక్షన్ కు మొబైల్ నెంబర్ ఇవ్వాలన్న తెలంగాణ విద్యుత్ శాఖ

Electricity Department Asking Customers Mobile Numbers
  • బిల్లులు, ఇతర వివరాలను మెసేజ్ చేస్తామని వెల్లడి
  • ఇప్పటికీ కొంతమంది వినియోగదారుల నెంబర్లు లేవని వివరణ
  • విద్యుత్ రెవెన్యూ ఆఫీసులో నెంబర్ ఇవ్వాలని సూచన

విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతీ వినియోగదారుడు తమ మొబైల్ నెంబర్ ను అందించాలని తెలంగాణ విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ రెవెన్యూ ఆఫీసులో తమ కనెక్షన్ కు సంబంధించిన వివరాలలో ఫోన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. బిల్లులు సహా ఇతరత్రా సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. దీనివల్ల బిల్లుల వివరాలను ఫోన్ కు మెసేజ్ చేస్తామని, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవడం సులభంగా మారుతుందని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి మెసేజ్ లు అందుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొంతమంది వినియోగదారుల నెంబర్లు అప్ డేట్ కాకపోవడంతో వారికి మెసేజ్ లు వెళ్లడంలేదని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News