Zomato: ఫుడ్ డెలివరీ చాటున గంజాయి అమ్మకం.. జొమాటో డెలివరీ బాయ్ అరెస్టు

Ganja Selling Zomato Delivery Boy Arrested In Raidurgam
  • ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతున్న యువకుడు
  • భద్రాచలంలో కొనుగోలు.. హైదరాబాద్ లో అమ్మకం
  • అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు
ఈజీ మనీ కోసం గంజాయి దందా చేస్తున్న ఓ డెలివరీ బాయ్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో కొండాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో సోదాలు జరిపారు. అంజయ్యనగర్ లోని ఈ హాస్టల్ లో ఉంటూ నవీన్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అక్రమ మార్గం పట్టాడు.

భద్రాచలంలో ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి రహస్యంగా సిటీకి తీసుకొస్తున్నాడు. సిటీలో పలువురికి గంజాయి అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సోదాల్లో నవీన్ దగ్గర దాదాపు 800 గ్రాముల గంజాయి పట్టుబడిందని వివరించారు. దీని విలువ సుమారు రూ.56 వేలు ఉంటుందని పేర్కొన్నారు. నవీన్ పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని, గంజాయి ఎవరి దగ్గరి నుంచి కొనుగోలు చేశాడనే వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Zomato
Delivery boy
Ganja
Raidurgam
Weed

More Telugu News