‘పద్మ’ పురస్కారాల విజేతలకు రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం
- హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ చేతుల మీదుగా సన్మానం
- సీఎం తరపున వెంకయ్య నాయుడు, చిరంజీవిని ఆహ్వానించిన మంత్రి జూపల్లి
- పద్మశ్రీ పురస్కార విజేతలకు సాంస్కృతిక శాఖ అధికారుల ఆహ్వానం
వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు.