విజయవాడలోని సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు
- ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి
- ఆలయం వద్దే భిక్షాటన
- ఇకపైనా ప్రతీ రూపాయి దైవకార్యానికే వెచ్చిస్తానని వెల్లడి
ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ సంపాదించే సొమ్మును తిరిగి స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపైనా ప్రతీ రూపాయి దైవ కార్యానికే అందిస్తానని ఈ సందర్భంగా యాదిరెడ్డి తెలిపారు. తన జీవితం బాబా సేవకే అంకితమన్న ఆయన ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం ఇవ్వడం గమనార్హం.