Bandi Sanjay: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay blames CM Revanth Reddy for congress promises
  • 1 ఫిబ్రవరి 2024న గ్రూప్ 1 నియామకాలు చేపడతామని కాంగ్రెస్ చెప్పిందన్న బండి సంజయ్
  • డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకొని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారని వెల్లడి
  • కానీ ఇప్పటి వరకు వాటి ఊసేలేదు... కనీసం నోటిఫికేషన్ వేయలేదన్న బండి సంజయ్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1 ఫిబ్రవరి 2024న గ్రూప్ 1 నియామకాలను చేపడతామని హామీ ఇచ్చారని, డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకొని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారని... కానీ అవేమీ చేయడం లేదన్నారు.

ఇప్పటి వరకు వాటి ఊసే లేదన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోను తాము పవిత్రంగా చూస్తామని... ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. కానీ హామీల గురించి మాట్లాడటం లేదన్నారు.
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News