Sunil Gavaskar: అత్తగారి మరణంతో కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్

Gavaskar left commentary box after known his mother in law passed away
  • గవాస్కర్ కుటుంబంలో విషాదం
  • నేడు గవాస్కర్ అత్త గారు పుష్పా మెహ్రోత్రా కన్నుమూత
  • విశాఖలో టీమిండియా-ఇంగ్లండ్ టెస్టుకు కామెంటరీ చెబుతున్న గవాస్కర్
  • కుటుంబ సభ్యులతో కలిసి కాన్పూర్ పయనం

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇవాళ ఆయన అత్త గారు పుష్పా మెహ్రోత్రా కన్నుమూశారు. ఈ వార్త తెలిసే సమయానికి గవాస్కర్ టీమిండియా-ఇంగ్లండ్ టెస్టుకు కామెంటరీ చెబుతున్నారు. విశాఖలోని ఏసీఏ స్టేడియం కామెంటరీ బాక్సులో ఉన్న గవాస్కర్ అత్త గారి మరణ వార్త తెలిసిన వెంటనే, కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయారు. తన అర్ధాంగి మార్షనీల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాన్పూర్ పయనమయ్యారు.

  • Loading...

More Telugu News