Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాక్సర్ విజేందర్ సింగ్

Boxer Vijender Singh met Chief Minister Revanth Reddy
  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన బాక్సర్
  • ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్‌లలో కాంస్య పతకాలు సాధించిన బాక్సర్
  • 2019లో కాంగ్రెస్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన విజేందర్ సింగ్
ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. 2009 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో, 2010 కామన్వెల్త్ గేమ్స్‌లలోనూ కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. విజేందర్ సింగ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దక్షిణ ఢిల్లీ నుంచి బీజేపీ గెలవగా, రెండో స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. విజేందర్ సింగ్ మూడో స్థానంలో నిలిచాడు.
Revanth Reddy
vijender singh
Congress

More Telugu News