Hemant Soren: మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

Hemant Soren in SC Apex Court refuses to entertain plea says please approach high court
  • మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్
  • అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం 
  • సోరెన్ పిటిషన్ స్వీకరించబోమన్న సర్వోన్నత న్యాయస్థానం
  • హైకోర్టే ఇందుకు తగిన వేదిక అని స్పష్టీకరణ
మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎమ్ఎమ్ పార్టీ అధినేత హేమంత్ సోరెన్‌కు శుక్రవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని సుప్రీం పేర్కొంది. ఈ పిటిషన్‌కు తగిన వేదిక సుప్రీంకోర్టు కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌పై హైకోర్టును ఆశ్రయించాలని మాజీ సీఎంకు సూచించింది. 

ఝార్ఖండ్‌లో అక్రమ భూలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పీఎమ్ఎల్‌ఏ కోర్టు సోరెన్‌కు ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, పది రోజుల రిమాండ్ కావాలని ఈడీ కోరడంతో తీర్పును నేటికి రిజర్వ్ చేసింది.
Hemant Soren
Supreme Court
Jharkhand
Enforcement Directorate

More Telugu News