Visakhapatnam Test: విశాఖ టెస్ట్ మ్యాచ్.. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా

India won the toss and elected bat in Visakhapatnam test against England
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా
  • ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్న రజత్ పటిదార్
  • ఇండియా స్కోరు.. 4 ఓవర్లకు 13 పరుగులు
విశాఖలో ఇండియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇండియా స్కోరు 4 ఓవర్లకు 13 పరుగులు. జైస్వాల్ 9 పరుగులు, రోహిత్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా రజత్ పటిదార్ ఆరంగేట్రం చేస్తున్నాడు. సర్ఫరాజ్ కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. 

ఇండియా జట్టు: యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, బుమ్రా, ముఖేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్. 

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్, హార్ట్ లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
Visakhapatnam Test
Team New Zealand
England
Score Card

More Telugu News