Priyanka Chopra: నీళ్లు లీక్ అవుతున్నాయంటూ రూ.165 కోట్ల భవంతిని వీడిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్

Priyanka Chopra and Nick Jonas leaves their luxury mansion in Los Angeles
  • అమెరికన్ నటగాయకుడు నిక్ జోనాస్ ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా
  • లాస్ ఏంజెలిస్ లో కాపురం
  • రూ.165 కోట్లతో భవంతి కొనుగోలు
  • నీళ్ల లీకేజితో ఇంట్లోని అనేక భాగాలు డ్యామేజి
  • ఇల్లు అమ్మిన వ్యక్తిపై ప్రియాంక, జోనాస్ దావా
అమెరికన్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ ను పెళ్లాడాక అందాలభామ ప్రియాంక చోప్రా తన మకాంను అమెరికాకు మార్చివేశారు. హాలీవుడ్ తారల కేంద్ర స్థానం లాస్ ఏంజెలిస్ నగరంలో సుమారు రూ.165 కోట్లతో అత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భవంతిలోనే ఉంటున్నారు. 

ఆ ఇంటిలో 7 బెడ్రూంలు, 9 వాష్ రూంలు, చెఫ్ కిచెన్, స్పా, స్టీమ్ షవర్, మినీ థియేటర్, బిలియర్డ్స్ రూమ్, వైన్ సెల్లార్ టెంపరేచర్ అండ్ హ్యుమిడిటీ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. అయితే, ఇంత  లగ్జరియస్ ఇంటిలో నీళ్లు లీకవుతున్నాయట. 

వాటర్ లీకేజి కారణంగా ఇప్పటికే ఇంట్లోని చాలా భాగాలు పాడైపోవడంతో, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. తమకు లోపభూయిష్టమైన ఇంటిని అమ్మారని, పరిహారం చెల్లించాలని కోరుతూ ప్రియాంక, జోనాస్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ ఇంటిని మరమ్మతులు చేయించాలంటే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
Priyanka Chopra
Nick Jonas
Luxury Mansion
Water Leak
Los Angeles
Hollywood

More Telugu News