Kesineni Chinni: కేశినేని నానికి విశ్వాసం లేదు.. సైకోలంతా ఒకే చోటకు చేరారు: కేశినేని చిన్ని

I am ready to contest on Kesineni Nani says Kesineni Chinni
  • కేశినేని నానిపై పోటీకి సిద్ధమన్న కేశినేని చిన్ని
  • ఎంపీగా పోటీ చేస్తే నాని 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని విమర్శ
  • దేవినేని అవినాశ్ ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా
విజయవాడ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు. కేశినేని నానికి విశ్వాసం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని వైసీపీలో చేరడంతో... సైకోలందరూ ఒకే చోటకు చేరినట్టయిందని అన్నారు. విజయవాడ లోక్ సభకు కేశినేని నాని పోటీ చేస్తే కచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అయితే, విజయవాడ టికెట్ ను నానికి ఇచ్చే అంశంలో వైసీపీ నాయకత్వం ఇంత వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. 

టీడీపీలో ఉన్నప్పుడు కేశినేని నానికి చాలా గౌరవం ఉండేదని... వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన స్థాయి దిగజారిందని చిన్ని చెప్పారు. దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడిగా నాని మారారని ఎద్దేవా చేశారు. విజయవాడ నుంచి తాను బరిలోకి దిగే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలని తమ నాయకత్వం సూచిస్తుందో... అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ చర్చిస్తారని చెప్పారు. కేశినేని నానిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు.
Kesineni Chinni
Chandrababu
Telugudesam
Kesineni Nani
Devineni Avinash
YSRCP
Pawan Kalyan
Janasena
AP Politics

More Telugu News