నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఫొటోలు ఇవిగో
- ఉదయం 11 గంటలకు కేంద్ర మధ్యంతర బడ్జెట్
- పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన నిర్మలా సీతారామన్
- బడ్జెట్ పై కాసేపు చర్చించిన వైనం
ఇంకోవైపు పార్లమెంటుకు వెళ్లడానికి ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలకు ద్రౌపది ముర్ము తన చేతులతో స్వీటు తినిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కిషన్ రావ్ కరాద్, పంకజ్ చౌదరిలతో పాటు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు. బడ్జెట్ పై వీరు కాసేపు చర్చించుకున్నారు. అనంతరం నిర్మల రాష్ట్రపతి భవన్ నుంచి బయల్దేరి పార్లమెంటుకు చేరుకున్నారు.

