Tanjavur: నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉంది.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన భార్య

Tanjavur woman alleged that his husband affairs with 500 women
  • సీబీసీఐడీతో విచారణ జరిపించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన తంజావూరు మహిళ
  • భర్త సెల్‌ఫోన్‌లో 500 నుంచి 100 వరకు అసభ్యకర వీడియోలు ఉన్నాయని తెలిపిన బాధితురాలు
  • భర్త, అత్తమామలను నిలదీస్తే బెదిరించారని ఆరోపణ
  • జవాబివ్వాలంటూ ఎస్పీ, సీబీసీఐడీకి హైకోర్టు ఆదేశాలు
తమిళనాడుకు చెందిన ఓ మహిళ భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ఏకంగా 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తంజావూరుకు చెందిన ఆర్తి మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో పిటిషన్ వేస్తూ.. తన భర్త వివేక్‌రాజ్‌కు 500 మంది మహిళలతో సంబంధం ఉందని ఆరోపించింది. ఆయన మొబైల్ ఫోన్‌లో 500 నుంచి 1000 వరకు అశ్లీల వీడియోలు ఉన్నాయని, అసభ్యకరంగా ఉన్న వీడియోకాల్ స్క్రీన్‌షాట్లు, ఫొటోలు ఉన్నట్టు పేర్కొంది. 

ఈ విషయమై భర్తతోపాటు అత్తమామలను ప్రశ్నిస్తే ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని ఆర్తి ఆరోపించింది. తాను రెండు నెలల గర్భంతో ఉన్పప్పుడు దాడిచేయడంతో అబార్షన్ అయిందని, తంజావూరు ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొంది. కాబట్టి తన భర్త వ్యవహారంపై సీబీసీఐడీతో దర్యాప్తు జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరింది. మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రాగా దీనిపై జవాబివ్వాలని తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీని న్యాయస్థానం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
Tanjavur
Tamil Nadu
Tamil Nadu High Court
Illegal Affair

More Telugu News