Agni Chopra: భారత క్రికెట్లో చరిత్ర సృష్టించిన బాలీవుడ్ దర్శకుడి కుమారుడు

Agni Chopra creates history by making back to back centuries in his firsy four Ranji matches
  • క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న దర్శకుడు విధు వినోద్ చోప్రా తనయుడు
  • రంజీ ట్రోఫీలో మిజోరంకు ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్ని చోప్రా
  • తొలి 4 మ్యాచ్ ల్లో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు 
  • ఇప్పటివరకు 5 సెంచరీలు బాదిన అగ్ని చోప్రా 
  • 25 ఏళ్ల అగ్ని చోప్రాకు ఇదే తొలి రంజీ సీజన్ 
బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన తనయుడు అగ్ని చోప్రా భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో సెంచరీలతో పరుగులు వెల్లువెత్తిస్తున్నాడు. అగ్ని చోప్రాకు ఇదే తొలి రంజీ సీజన్. 

25 ఏళ్ల అగ్ని ఆడుతున్న తొలి రంజీ సీజన్ లో తొలి 4 మ్యాచ్ ల్లో 5 సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో ఇలా తొలి 4 మ్యాచ్ ల్లో సెంచరీలు చేసిన ఆటగాడు ఇతడొక్కడే. 

అగ్ని చోప్రా రంజీల్లో మిజోరం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో ఈ యువ ఆటగాడు సెంచరీలతో విరుచుకుపడ్డాడు. మేఘాలయపై రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీలు చేయడం విశేషం.
Agni Chopra
Vidhu Vinod Chopra
Ranji Trophy
Centuries
Cricket
Bollywood

More Telugu News