Rakul Preet Singh: ప్రధాని మోదీ పిలుపుతో తమ పెళ్లి వేదికను భారత్ కు మార్చుకున్న రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ

Rakul Preet and Jackie Bhagnani will tie the knot in Goa as per PM Modi Swadesi call
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని
  • మిడిల్ ఈస్ట్ దేశాల్లో పెళ్లి చేసుకోవాలని భావించిన వైనం
  • ప్రముఖులు తమ పెళ్లిళ్లను భారత్ లో చేసుకోవాలని సూచించిన మోదీ
  • గోవాలో ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకునేందుకు రకుల్, జాకీ నిర్ణయం
గత కొంతకాలంగా భారత్ లో సంపన్న వర్గాలు, సెలెబ్రిటీలు తమ వివాహాలను విదేశాల్లో చేసుకుంటుండడం తెలిసిందే. అయితే, ప్రధాని మోదీ ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్ లపై దృష్టి సారించారు. ప్రముఖులు తమ ఇంట శుభకార్యాలను విదేశాల్లో కాకుండా భారత్ లోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 

ప్రధాని సూచన నేపథ్యంలో... ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని తమ పెళ్లి వేదికను భారత్ కు మార్చుకున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్, జాకీ భగ్నాని తమ పెళ్లిని మధ్య ప్రాచ్యంలో చేసుకోవాలని భావించారు.

మిడిల్ ఈస్ట్  దేశాల్లో పెళ్లి చేసుకోవాలని భావించిన వీరిద్దరూ... గత ఆర్నెల్లుగా అందుకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. అయితే ప్రధాని ఇచ్చిన పిలుపుతో మనసు మార్చుకున్నారు. ఫిబ్రవరి 21న గోవాలో తమ వివాహ వేడుక జరుపుకునేందుకు కొత్త ముహూర్తం నిర్ణయించుకున్నారు.
Rakul Preet Singh
Jackie Bhagnani
Wedding
Goa
Foreign
Narendra Modi
Destination Wedding
Swadesi
India

More Telugu News