Popular Front of India: కేరళ బీజేపీ ఓబీసీ నేత హత్య కేసులో 14 మందికి మరణశిక్ష

14 PFI Banned Group Members Awarded Death Sentence for Killing BJP OBC leader
  • తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు
  • 2021లో శ్రీనివాసన్ దారుణ హత్య
  • తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు
కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యులు 14 మందికి కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. డిసెంబరు 2021లో శ్రీనివాసన్ హత్యకు గురయ్యారు. దోషులకు గరిష్ఠ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది.

దోషులు మామూలు వ్యక్తులు కాదని, శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని పేర్కొంది. బాధితుడిని అతడి తల్లి, భార్య, పిల్లల ముందే దారుణంగా హత్య చేశారని తెలిపింది. నేరాల్లోనే ఇది అత్యంత అరుదైనదని కోర్టుకు తెలిపింది. ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న మలెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
Popular Front of India
PFI
Kerala
Death Sentence
BJP

More Telugu News