MK Stalin: స్పెయిన్ వెళుతూ విమానంలో జకోవిచ్ ను కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్

Tamilnadu CM MK Stalin met Tennis great Novak Djokovic in mid air
  • స్పెయిన్ లో 8 రోజుల పర్యటనకు వెళ్లిన స్టాలిన్
  • విమానంలో టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ తో భేటీ
  • ఆకాశవీధిలో ఆశ్చర్యకర కలయిక అంటూ తమిళనాడు సీఎం ట్వీట్
అప్పుడప్పుడు కొన్ని అరుదైన కలయికలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 8 రోజుల పర్యటన కోసం స్పెయిన్ వెళ్లారు. అయితే, స్పెయిన్ వెళుతుండగా విమానంలో ఆయనకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కనిపించాడు. దాంతో, స్వయంగా వెళ్లి జకోవిచ్ ను పలకరించారు. 'ఆకాశవీధిలో ఆశ్చర్యకరమైన కలయిక' అంటూ స్టాలిన్ దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీస్ లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి తిరిగివస్తుండగా, విమానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ జరిగింది. 

స్పెయిన్ పర్యటనలో భాగంగా తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించాలన్నది సీఎం స్టాలిన్ ప్రయత్నం. స్పెయిన్ పర్యటనలో రోకా, గెస్టాంప్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
MK Stalin
Novak Djokovic
Spain
Tamil Nadu
Australian Open

More Telugu News