Filmfare Awards: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’

12th Fail wins best film at Bollywoods 69th Filmfare Awards
  • యానిమల్ సినిమాకి ఉత్తమ నటుడిగా నిలిచిన రణ్‌బీర్ కపూర్
  • రాకీ ఔర్ రాణి సినిమాకి ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న అలియా భట్
  • విక్రాంత్ మాస్సేకి దక్కిన క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డు
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. అలియా భట్ ఉత్తమ నటిగా(రాకీ ఔర్ రాణి ), రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా(యానిమల్) నిలిచారు. ఇక ‘12th ఫెయిల్’ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, విక్రాంత్ మాస్సే నటించిన ‘12th ఫెయిల్’ సినిమాలు అవార్డులను కొల్లగొట్టాయి. కాగా విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. గుజరాత్‌లో జరిగిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి కరణ్ జొహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. జాన్వీ కపూర్ నుంచి వరుణ్ ధావన్ వరకు పలువురు సెలబ్రిటీలు 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ వేడుకకు హాజరయ్యారు.

ఉత్తమ దర్శకుడిగా విదు వినోద్ చోప్రా(12th ఫెయిల్), ఉత్తమ నటి(క్రిటిక్స్) రాణీ ముఖర్జీ(మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), ఉత్తమ నటి(క్రిటిక్స్) షెఫాలీ షా (Three of Us), ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) జోరామ్, ఉత్తమ సహాయ నటుడిగా విక్కీ కౌశల్(డంకీ), ఉత్తమ సహాయ నటి షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ), ఉత్తమ అరంగేట్ర నటుడు తరుణ్ డుడెజా, ఉత్తమ అరంగేట్ర నటి అలీజే అగ్నిహోత్రి నిలిచారు. ఇక బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా భూపిందర్ బాబ్బల్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా (ఫీమేల్) శిల్పా రావుకి అవార్డులు దక్కాయి.
Filmfare Awards
Bollywood
69th Filmfare Award
Ranbir Kapoor
Alia Bhatt

More Telugu News