Daggubati Purandeswari: ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలు ప్రకటించిన పురందేశ్వరి

Purandeswari made AP BJP organisational appointments
  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర బీజేపీ
  • 25 జిల్లాలను ఐదు క్లస్టర్లుగా విభజన
  • ఐదు క్లస్టర్లకు ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిల నియామకం
  • 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంయోజకులు, ప్రభారీల నియామకం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఏపీ బీజేపీ సంస్థాగత నియామకాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దృష్టి సారించారు. ఇవాళ క్లస్టర్ ఇన్చార్జిలు, సహ ఇన్చార్జిలు, లోక్ సభ స్థానాలు సంయోజకులు, ప్రభారీలను ప్రకటించారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పురందేశ్వరి పేర్కొన్నారు. 25 జిల్లాలను ఐదు క్లస్టర్లు చేసి వాటికి ఇన్చార్జిలను, సహ ఇన్చార్జిలను నియమించారు. అదే సమయంలో 25 పార్లమెంటు స్థానాలకు సంయోజకులను, ప్రభారీలను నియమించారు.
Daggubati Purandeswari
BJP
Andhra Pradesh

More Telugu News