Teegala Krishna Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి... వీడియో ఇదిగో

Former MLA Theegala Krishna Reddy met Chief Minister Revanth Reddy in the Secretariat
  • రేవంత్ ను వరుసగా కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు  
  • నేడు సచివాలయంలో సీఎంను కలిసిన బీఆర్ఎస్ నేత
  • హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా పని చేసిన తీగల కృష్ణారెడ్డి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయన సీఎంను కలిశారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ రెడ్డి సమీక్ష

బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
Teegala Krishna Reddy
Revanth Reddy
Congress
BRS

More Telugu News