Padma Vibhushan: మా కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు ఉన్నారు: ఉపాసన

Upasana says their family have two Padma Vibhishan awardees
  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్
  • మెగా కుటుంబంలో సంతోషాల హరివిల్లు
  • ప్రతాప్ సి రెడ్డి, చిరంజీవి కలిసున్న ఫొటో పంచుకున్న ఉపాసన
  • గతంలో ప్రతాప్ సి రెడ్డికి పద్మ విభూషణ్
  • ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉపాసన ట్వీట్
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడం తెలిసిందే. చిరంజీవి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోనుండడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. తాజాగా, మెగా కోడలు ఉపాసన ఆసక్తికర ట్వీట్ చేశారు. 

తమ కుటుంబంలో ఇద్దరు పద్మ విభూషణ్ లు ఉన్నారని వెల్లడించారు. ఒకరు తన తాతయ్య డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, మరొకరు తన మామయ్య చిరంజీవి కొణిదెల అని వివరించారు. తమ కుటుంబానికి ఇంతటి విశిష్ట గౌరవం దక్కడాన్ని ఆశీర్వచనంలా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి, ప్రతాప్ సి రెడ్డి కలిస్తున్న ఫొటోను కూడా ఆమె ఎక్స్ లో పంచుకున్నారు.

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డికి కేంద్రం 1991లో పద్మ భూషణ్ ప్రకటించింది. 2010లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. చిరంజీవి 2006లో పద్మ భూషణ్ అందుకున్నారు.
Padma Vibhushan
Chiranjeevi
Pratap C Reddy

More Telugu News