రెస్పెక్టెడ్ సర్... అంటూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ లేఖ
- ఏపీలో కుల గణన
- ఎన్నికల సమయంలోనే ఎందుకు అంటూ పవన్ లేఖాస్త్రం
- సీఎం జగన్ కు 12 ప్రశ్నలు సంధించిన జనసేనాని
- జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంటూ స్పష్టీకరణ
అయితే, వ్యక్తిగత దూషణలకు పోకుండా, సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇక తన లేఖకు ఎన్నికల వేళ కుల గణన ఎందుకు? అనే హెడ్డింగ్ పెట్టారు. ఇందులో 12 ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీటన్నింటికీ గౌరనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని స్పష్టం చేశారు.