Ilayaraja: ఒక్క ఫొటోతో పుత్రికా శోకాన్ని వెలిబుచ్చిన ఇళయరాజా

Ilayaraja express his sadness about his daughter death
  • ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూత
  • లివర్ క్యాన్సర్ తో బాధపడిన భవతారిణి
  • ఇళయరాజాకు ప్రముఖుల సంతాపాలు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె భవతారిణి (47) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మృతితో ఇళయరాజా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తన పుత్రికా శోకాన్ని సోషల్ మీడియాలో ఒక్క ఫొటోతో వెల్లడించారు. తన కుమార్తె చిన్నప్పటి ఫొటో పంచుకున్న ఇళయరాజా 'నా బుజ్జి తల్లి' అంటూ స్పందించారు. కాగా, కుమార్తెను కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఇళయరాజాకు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Ilayaraja
Bhavatarini
Death
Kollywood
Tamil Nadu

More Telugu News