revuri prakash reddy: ఆర్టీసీ బస్సును నడిపిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

MLA Revuri Prakash Reddy drives RTC bus
  • పరకాలలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రేవూరి
  • పరకాల డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు వెల్లడి
  • ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆడపడుచులకు ఉచిత బస్సు హామీని నెరవేర్చామని వెల్లడి

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆర్టీసీ బస్సును నడిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆర్టీసీ బస్సులను హన్మకొండ జిల్లా పరకాలలో రేవూరి ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన సరదాగా బస్సును నడిపారు. పరకాల డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలలో భాగంగా ఆడపడుచులకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని నెరవేర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1400 కొత్త బస్సులు వచ్చాయన్నారు. ఇందులో పరకాల డిపోకు ఇరవై బస్సులు వచ్చాయన్నారు.

  • Loading...

More Telugu News