Chiranjeevi: మా చిరుతను 'పద్మ విభూషణ్' పురస్కారంతో గౌరవించారు: ఉపాసన

Upasana hails Chiranjeevi as their inspiration
  • మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • చిరంజీవిపై అభినందనల వర్షం
  • ఆనందోత్సాహాల్లో మెగా ఫ్యామిలీ
  • మా స్ఫూర్తి ప్రదాత అంటూ ఉపాసన స్పందన

తెలుగు చలన చిత్రసీమలో ఏకైక మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం 'పద్మ విభూషణ్' ప్రకటించడం తెలిసిందే. గత రాత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి చిరంజీవిపై అభినందనల జడివాన కురుస్తోంది. మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 

తాజాగా, ఈ అంశంపై చిరంజీవి కోడలు ఉపాసన కొణిదెల స్పందించారు. "ఐదు వేళ్లు బిగిస్తే శక్తిమంతమైన పిడికిలి ఏర్పడుతుంది. మా స్ఫూర్తిప్రదాతకు అభినందనలు. కేవలం సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ ఆయన ఆదర్శప్రాయుడే. తండ్రిగా, మామయ్యగా, తాతగా ఆయన ఓ మార్గదర్శి. మా చిరుతను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాం" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. 

అంతేకాదు, క్లీంకార, ఇతర మనవరాళ్లతో చిరంజీవి కలిసున్న ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. ఈ ఫొటోలో క్లీంకార ముఖాన్ని బ్లర్ చేశారు.

  • Loading...

More Telugu News